రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!

  • కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన
  • 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట
  • బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్‌
  • 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ జీవితంలోకి మరో చిన్నారికి స్వాగతం పలకబోతున్నారు. దీపికా రెండోసారి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్తను వారు పంచుకున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీపికా ఒక క్యూట్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో వారి మొదటి కుమార్తె దువా, పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను చేతిలో పట్టుకుని కనిపించింది. ఈ పోస్ట్‌కు దీపికా ఎలాంటి క్యాప్షన్ రాయకుండా కేవలం రెండు దిష్టిచుక్క ఎమోజీలను మాత్రమే జతచేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వగా, అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నటి భూమి పెడ్నేకర్ "కంగ్రాట్యులేషన్స్" అని కామెంట్ చేయగా, సమంత, పరిణీతి చోప్రా కూడా రెడ్ హార్ట్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

2018 నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంటకు, 2024 సెప్టెంబర్ 8న మొదటి సంతానంగా కుమార్తె దువా జన్మించింది. "దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానంగా తను వచ్చింది" అంటూ అప్పట్లో వారు ఎంతో అర్థవంతమైన పోస్ట్ పెట్టారు. ఇప్పుడు దువా పుట్టిన ఏడాదిన్నర లోపే రెండో బిడ్డ రాక గురించి ప్రకటించడం విశేషం.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గోలియోం కీ రాస్‌లీలా రామ్-లీలా' సినిమా సెట్స్‌లో వీరి ప్రేమకథ మొదలైంది. 2015లో మాల్దీవుల పర్యటనలో రణ్‌వీర్, దీపికాకు ప్రపోజ్ చేశారు. మూడేళ్ల పాటు తమ ఎంగేజ్‌మెంట్ విషయాన్ని రహస్యంగా ఉంచి, ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ జంట 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్', '83' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు రెండో బిడ్డ రాకతో వీరి కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది.

Deepika Padukone
Ranveer Singh
Deepika Ranveer baby
Bollywood couple
pregnancy announcement
Dua
Bollywood news
celebrity baby
Indian cinema
Ranveer Deepika movies

More Telugu News